Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళలే సమాజాన్నితీవ్ర ప్రభావితం చేస్తాయి

కళలే సమాజాన్నితీవ్ర ప్రభావితం చేస్తాయి

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి
 కళలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని కళాకారులు  తమ కళారూపాల ద్వారా  చైతన్య వంతంగా ప్రజల హృదయాలను తట్టి లేపుతారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ లో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ చక్రవర్తి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నర్సింహ ఆధ్వర్యంలో బస్సు యాత్రలో భాగంగా కళాకారులు  ఎంజాయ్ పేరుతో గంజాయి కళాజాత విద్యార్థులను చైతన్య పరిచినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు నేడు మితిమీరిన సాంకేతికత పరిజ్ఞానం  పేరుతో సోషల్ మిడియా ప్రభావం వలన సమాజం తిరోగమనానికి దారి తీస్తుందన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలో నిర్మాణాత్మక మార్పుకు కృషి చేయాలన్నారు. డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే వినోద్  మాట్లాడుతూ యువత సులభంగా డబ్బు సంపాదించే మార్గంలో  సైబర్ నేరాలు పెరిగాయన్నారు.డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ  మాదకద్రవ్యాల వినియోగం ఒకసారి ప్రారంభమైతే తనని బానిసగా మార్చుకుంటుందన్నారు. యువత ఈ మధ్యకాలంలో  ఎంజాయ్ పేరుతో గంజాయిని సేవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతరం  కళాకారుల బృందం  ఆట పాటల ద్వారా,  విచిత్ర ప్రదర్శనల ద్వారా,  నాటికల ద్వారా గంజాయి వలన నష్టాలను సజీవంగా కళ్ళకు కట్టినట్లు  అవగాహన పరిచి విద్యార్థులను చైతన్య పరిచారు. కార్యక్రమం అనంతరం  పల్లె నరసింహ  గంజాయి పేరుతో ఎంజాయ్ అనే పాట ప్రేక్షకుల హృదయాలను కలిచివేసింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త  ప్రొఫెసర్. కే. అపర్ణ తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షులు శ్రీనివాస్, పిఆర్ఓ డాక్టర్. ఏ. పున్నయ్య, శ్రీధర్ బట్టు, రఘురాం, రెహమాన్, సంజీవ్ ల తో పాటు యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -