Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి హేయం..

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి హేయం..

- Advertisement -

నిందితున్ని  కఠినంగా శిక్షించాలి..
సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న 
నవతెలంగాణ – డిచ్ పల్లి

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ బి అర్ గవాయ్ పై సనాతన ధర్మమంటూ అగ్ర కులాల అహంకారంతో దాడి చెయ్యడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) తీవ్రంగా ఖండిస్తుందని, దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న డిమాండ్ చేశారు. బుదవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన ఈ అవమానకర దాడి యత్నం దేశంలో పెరుగుతున్న అసహన అమానుష దళిత వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు. అర్ ఎస్ ఎస్, బిజెపి పేంచి పోషిస్తున్న అనగారిన అగ్రకుల మతోన్మాద అమానికరణ లౌకిక వ్యతిరేక ధోరణికి ప్రతిబింబం ఈ దాడి అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని నిందుతునిపై, అతని వెనుక ఉన్న కుల మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ దాడిని మేధావులు ప్రజలు ప్రజాస్వామి కవాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా మండల కార్యదర్శి బోశెట్టి మురళి, డివిజన్ నాయకులు సంధ్య, గణేష్, కిషన్ ,నారాయణ, గంగాధర్ ,గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -