నవతెలంగాణ – మొయినాబాద్
విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ పరిధిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి స్కాలర్షిప్ విడుదల చేయకుండా చేస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ. 8వేల కోట్లు ఇప్పటికీ విడుదల చేయాకపోవడం సిగ్గు చేటు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. విద్య వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు వేతనాలను తక్షణమే రక్షణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బి. అరుణ్, జిల్లా నాయకులు వేణు, ఎస్ఎఫ్ఎ మొయినాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు రేశ్వంత్,చరణ్ గౌడ్, చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, ఎస్ఎఫ్ఎ చేవెళ్ల మండల సహాయ కార్యదర్శి మణికంఠ, మొయినాబాద్ మండల నాయకులు, విష్ణు, రవీందర్, ప్రదీప్ రెడ్డి,కాళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



