సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా ఎస్ కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈచిత్ర ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
భారతీయ పురాణాల్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారని పోస్టర్ చెప్పకనే చెబుతోంది. మానవాళికి దైవత్వానికి, శాపానికి శక్తికి మధ్య జరిగే సంగ్రామానికి చిహ్నంగా ఈ పోస్టర్ నిలిచింది. మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకెళ్తుంటే, సుధీర్ బాబు యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని వెనుక ఉగ్ర శివుడి రూపం కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది.
ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 8న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తున్నారు. దీనికి సహ నిర్మాతలు : అక్షరు కేజ్రీవాల్, కుసుమ్ అరోరా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : దివ్య విజరు.
శాపానికి, శక్తికి మధ్య జరిగే సంగ్రామం
- Advertisement -
- Advertisement -