Saturday, January 3, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యుత్‌ సవరణ బిల్లుపై ఇక యుద్ధమే

విద్యుత్‌ సవరణ బిల్లుపై ఇక యుద్ధమే

- Advertisement -

కేంద్ర విధానాలపై క్షేత్రస్థాయి ఉద్యమం
ప్రమాదంలో ప్రజల బతుకులు
విశాఖ ఉక్కుపై బీజేపీ రాజకీయ కుట్రలను తిప్పికొడతాం : సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌

విశాఖ నుంచి ఎస్‌.వెంకన్న

దేశాన్ని 12ఏండ్లుగా పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజా జీవనం ప్రమాదంలో పడిందని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. కొత్త విద్యుత్‌ సవరణ బిల్లును కార్పొరేట్లు లబ్ధిపొందేలా, లేబర్‌ కోడ్‌లను యాజమాన్యాలకు అనుకూలంగా తెచ్చి కార్మికుల హక్కులపై దాడి చేస్తున్నదని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి గ్రామస్థాయిలో ఉపాధి ఉసురు తీసేస్తు న్నారని విమర్శించారు. వీటన్నింటిపై ప్రభుత్వ విధానంలో మార్పు రావాలనీ, దానికోసం త్వరలో క్షేత్రస్థాయి ఉద్యమాన్ని సీఐటీయూ నిర్వహిస్తుందని తెలిపారు. విశాఖ బీచ్‌ రోడ్డులో మూడు రోజులుగా ఏయూ కన్వెన్షన్‌ సెంటర్లో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల సందర్బంగా శుక్రవారం మధ్యాహ్నం సీఐటీయూ ఏపీ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడారు. బీజేపీి హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేకుండా పోయింది.

40శాతం ప్రజల సంపదను కార్పొరేట్లు గుప్పెట పెట్టుకున్నారు. సామాన్య జనం వద్ద 10శాతం సంపద కూడా లేదు. లేబర్‌ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులపై దాడిచేస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే పరిస్థితుల్లో సమరశీల ఉద్యమాలకు సీఐటీయూ సిద్ధమవుతున్నది అని చెప్పారు. దేశ రక్షణ, ప్రజల జీవనం మెరుగు కోసం ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెతో శంఖారావం పూరించబోతున్నామన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల్లో వీటన్నింటిపై రాష్ట్రాల వారీగా ఎలా పోరాడాలో స్థానిక అనుభవాలను ప్రతినిధులు ఇప్పటికే చర్చల సమయంలో తెలిపారని చెప్పారు. బీజేపీి విధానాలతో సామాన్య ప్రజల ఆదాయాలు పడిపోతూ, ఉపాధి తగ్గిపోతుంటే మరోవైపు దేశ ప్రజలను కుల, మతాల వారీగా విభజన చేసే ‘నేరపూరిత విద్వేషాల’ను పెంచే యత్నాలకు దిగుతుందనీ, ఇలాంటి ఆటలు సీఐటీయూ సాగనివ్వదని హెచ్చరించారు. లేబర్‌ కోడ్లను రద్దుచేసి పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కుపై రాజకీయ కుట్రలు
18వ అఖిల భారత సీఐటీయూ మహాసభల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రతినిధులు చర్చించారని తెలిపారు. ‘ఐదేండ్లుగా ముడిసరుకు ఇవ్వరు, ఉత్పత్తి సక్రమంగా జరగనివ్వరు, వేతనాలు పూర్తిగా ఇవ్వరు, కన్వేయర్‌ బెల్టులు పోతాయి’ ఇవన్నీ కుట్రపూరితంగానే కేంద్ర బీజేపీి రాజకీయ డైరెక్షన్లో సాగుతున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -