‘తమిళం: మన కాలపు ఉత్తమ కథలు’… ఈ సంకలనంలో 22 కథలు ఉన్నాయి. సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రముఖులైన జయమోహన్, పెరుమాళ్ మురుగన్, సల్మా, ఇమాయం వంటి వారి 22 కథలను ఎడిటర్ పెరుందేవి ఒకచోట చేర్చారు. ఈ సంకలనంలో గత ముప్పై ఏండ్ల తమిళ సమాజ ఆకాంక్షలు, వేదనలు, పరివర్తనలు, విజయాలు మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా కులం, వర్గం, లింగం అసమానతలతో పాటు వలసరాజ్యాల అనంతర వారసత్వాల అవక్షేపాలను వాటి వాక్యనిర్మాణం, వాటి నిశ్శబ్దాలు, తిరుగుబాట్లు మనకు కనబడతాయి.
పెరుందేవి శ్రీనివాసన్ తమిళ సాహిత్యంలో ప్రముఖమైన వ్యక్తి. మద్రాస్ యూనివర్సిటీ నుండి బి.ఎస్ కెమిస్ట్రీ, మదర్ థెరిస్సా ఉమెన్స్ యూనివర్సిటీ నుండి ఎమ్మె ఉమెన్స్ స్టడీస్ చేశారు. అలాగే జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మె రిలీజియన్, హ్యూమన్ సైన్స్‌లో ఎంఫిల్, పిహెచ్‌డి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రొఫెసర్‌గా కొంత కాలం పని చేశారు. తమిళ సమాజం గురించి నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. ‘తిమిళం: ది బెస్ట్ స్టోరీస్ ఆఫ్ అవర్ టైమ్స్’ ద్వారా తమిళ సమాజ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. తమిళ ఫిక్షన్ కథల్లో ఈమెకు నచ్చేది ఏమిటంటే, అవి ఒక మూస ధోరణిలో ఉండవు. బదులుగా సమాజం, కుటుంబం, జీవితంలోని చిన్న చిన్న వైరుధ్యాలలో వాటి అర్థాన్ని కనుగొంటాయి. అవి వేసే బరువైన ప్రశ్నలకు ఒక అర్థం ఉంటుంది. స్త్రీ విలువ ఆమె గర్భంలో ఎలా చిక్కుకుంటుంది? ఓ దర్జీ గర్వం అరిగిపోయిన కుట్టు యంత్రంతో ఎలా ముడిపడి ఉంటుంది? మరీ ముఖ్యంగా మనిషి గుర్తింపు జాతి, మత, లింగం చుట్టూ ఎలా తిరుగుతుందో మనకు తెలియజేస్తాయి.
సామాజిక శక్తులను ఎదుర్కోవడం
పెరుందేవి ఎంచుకున్న వివిధ రకాల ఈ కథనాలు ఒక సామాజిక విషయంలో ఒకే ఒక నిర్దిష్ట అంతర్ దృష్టికి కట్టుబడి ఉన్నాయి. ఇది కేవలం స్త్రీ బాధ మాత్రమే కాదు వర్గం, కులం కూడా ఇందులో ఉంటాయి. ఈ కథలు పితృస్వామ్యం, సనాతన ధర్మం, నయా ఉదారవాదం వంటి సామాజిక శక్తులను ఎదుర్కొంటాయి. అందుకే ఇవి ప్రజలను కదిలిస్తున్నాయి. పాఠకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. వీటిలో జెపి సానక్య రాసిన ‘ది రూల్స్ ఆఫ్ ది గేమ్’. దీన్ని ఎన్ కళ్యాణ్ రామన్ అనువాదం చేశారు. దీని ప్రారంభం అంతర్లీనంగా ఉంది. ఒక సినిమా సన్నివేశంగా కనిపిస్తుంది. సామూహిక లైంగిక దాడికి గురై గర్భవతి అయిన ఒక స్త్రీపై సానుభూతి చూపించడానికి బదులు ఆ కుంటుంబం ఆమెను అవమానంగా భావిస్తుంది. ఇందులోని కథానాయకి నిశ్శబ్దంగా తన సొంత సామాజిక, రక్షణ బుడగ నుండి క్రాల్ చేయడానికి నిర్ణయించుకుంటుంది. అయితే జనని కన్నన్ అనువదించిన ఇమాయం రాసిన ‘హార్ట్‌బ్రేక్’లో ట్రోప్‌ను సున్నితమైన రీతిలో నిర్వహిస్తారు. పిల్లలు లేకపోవడంతో ఓ భర్త తన భార్యను శారీకరకంగా, మానసికంగా ఎంతగా హింసిస్తాడో చూడవచ్చు.
అది వారి గౌరవం
మరో నిశ్శబ్ద విస్ఫోటనం దేవిభారతి రాసిన ‘ది టూల్ ఆఫ్ హిస్ ట్రేడ్’. దీన్ని రామన్ అనువదించారు. ఇది మంగేష్ జోషి దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం లాతే జోషికి చాలా దగ్గరగా ఉంటుంది. జోషి లాగే ఇక్కడ కథానాయకుడు మారుతున్న కాలంతో ముందుకు సాగడు. అతని కుట్టు యంత్రం కేవలం భౌతిక వస్తువు కాదు. అది అతని గౌరవం, అతని చరిత్ర, అతని స్వీయ విలువ. ఇలా ఈ కథ సంకలనం అంతటా నడిచే విస్తృత ఇతివృత్తం ప్రతిధ్వనిస్తుంది. సాంకేతిక, సామాజిక, రాజకీయ మార్పులు కార్మిక వర్గాన్ని ఎలా స్థానభ్రంశం చేస్తాయో చూపిస్తాయి.
ఆంక్షల దుర్వాసన
రామన్ అనువదించిన కీరనూర్ జాకిర్‌రాజా రాసిన ‘ది సాగా ఆఫ్ బుచరీ’లో, ఒక వ్యక్తి బక్రీద్‌లో ఒంటెను బలి ఇచ్చి, దాని తెగిపోయిన తలను వెంటాడతాడు. ‘చివరి ప్రయత్నంగా ఉపయోగించే ఆయుధం ఎల్లప్పుడూ డబ్బు అని, దానికి ప్రత్యామ్నాయం లేదని హుస్సేన్‌కు తెలుసు’ అని కథకుడు వ్యాఖ్యానించాడు. అనువాదకుడు ఒంటె మాంసం దుర్వాసనను సమర్థవంతంగా బయటకు తెస్తాడు. ఒంటె లాగా పేద వర్గం ఆకాంక్షల దుర్వాసనను ప్రతిబింబించేలా కథకుడు కథను తీసుకొచ్చారు. రామన్ అనువదించిన పెరుమాళ్ మురుగన్ ‘ది బ్లౌజ్’లో ఒక వృద్ధ గ్రామీణ మహిళ తన కొడుకు పెండ్లిలో రవిక ధరించడానికి నిరాకరిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించదు. రవిక వల్ల ఆమె చంక కింద తిత్తి ‘నవజాత శిశువు తల అంత పెద్దది’గా పెరుగుతుంది. ‘ఆమె రవికను రోజువారీ కార్యకలాపాల వేళ్లన్నింటినీ కత్తిరించే హ్యాక్సాగా ఊహించుకుంది’ అని మురుగన్ రాశాడు.
ఓ విస్పోటనం
‘ది సాగా ఆఫ్ బుట్చెరీ’ లాగా అనేక కథలు ఆధునిక అధికార నిర్మాణాలలో పురుష గుర్తింపు, దుర్బలత్వాన్ని పరిశీలిస్తాయి. యశస్వి అరుణ్‌కుమార్ అనువదించిన అరవిందన్ ‘స్క్రీనింగ్’లో, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కించపరిచినపుడు జరిగే విస్పోటనాన్ని చూపెడుతుంది. ‘కోపం, కోరిక వంటివి బయటకు కనబడనీయకుండా అతను చాలాకాలంగా దాచుకుంటాడు. చాలా ఏండ్ల తర్వాత ఇది ఎలా బయట పడుతుందో చూడొచ్చు. ఈ కథలలో చాలా వరకు మనం ఎలా కనిపిస్తాము, ఆ చూపు స్వీయతను ఎలా పునర్నిర్మిస్తుంది అనే ప్రశ్నలు వినిపిస్తాయి. కన్నన్ అనువదించిన లత రాసిన ‘చీనలట్చుమిస్ క్యూ’లో సింగపూర్ వాతావరణం కనిపిస్తుంది. పాశ్చాత్య జాతి సోపానక్రమాలు, అంతర్-సమాజ కులతత్వం రెండింటి నుండి డయాస్పోరిక్ తమిళ స్త్రీత్వాన్ని తిరిగి పొందుతుంది. కథానాయిక ‘చీనా లచ్చుమి’ అనే అవమానకరమైన పేరును తిరస్కరించి, తన సొంత పదాలలో కనిపించాలని పట్టుబడుతోంది.
విలువైన సందేశం
ఈ సంకలనం అంతటా అనువాదాలు అద్భుతంగా ఉన్నాయి. రామన్ అనువాదాలు స్పష్టత, కచ్చితత్వంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే కన్నన్ స్త్రీల భావోద్వేగ ప్రకృతి దృశ్యాల అంతర్గత లయను, సంయమనం, సానుభూతితో సంగ్రహించారు. ఒక సమిష్టి ప్రయత్నంగా ఈ అనువాదాలు తమిళ భాషలకు, లయకు విశ్వసనీయతను కొనసాగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మందికి అంతగా తెలియని తమిళ పదాలను బాగా అర్థం చేసుకోవడానికి చివరలో ఒక చిన్న పదకోశం ఉంటే బాగుండేది. భాషతో పూర్తిగా పరిచయం లేని వ్యక్తులకు ఇవి కొంచెం
అస్పష్టంగా ఉంటాయి. ఏది ఏమైనా ఈ కథా సంకలనం సమాజానికి విలువైన సందేశాన్ని అందిస్తుంది. గతం, భవిష్యత్తు, కులం, వర్గం, పురుషులు, మహిళలు, భాష, నిశ్శబ్దం మధ్య ఉద్రిక్తతల రంగంగా తమిళ ఆధునికతను గుర్తించవచ్చు. మరో ముఖ్యమైన విషయంలో ఏమిటంటే ఈ సంకలనం నేటి సాహిత్య సంప్రదాయం వలె సమస్యలకు సులభమైన పరిష్కారాలను అందించదు.
మన కాలపు ఉత్తమ కథలు
- Advertisement -
- Advertisement -