Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన భాగవత అఖండ హరినామ సప్తహ

ముగిసిన భాగవత అఖండ హరినామ సప్తహ

- Advertisement -

పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్
నవతెలంగాణ – నిజాంసాగర్

మండలంలోని మల్లూరు గ్రామంలో భాగవత అఖండ హరినామ సప్తః శుక్రవారం ఘనంగా ముగిసింది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మొదలుకొని ఏడు రోజులు ఎంతోమంది మహాత్ములు, హరిభక్త పారాయణులు వైభవేతంగా, భక్తిశ్రద్ధలతో హరినామ సంకీర్తనలతో హరినామ సప్తహను ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

గ్రామమే కాకుండా భారతదేశం అంతా కూడా సుఖంగా, సుభిక్షంగా ఉండాలని పాడి పరిశ్రమ ఎదిగి విట్టల, రుక్మిణి, హనుమత్ దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లూరు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు గొల్ల హన్మండ్లు, బుడిమే శ్రీనివాస్, బండారి రాజు, ఊరటి వెంకట్, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -