నిర్మలాకాశం స్ఫూర్తి సంద్రమై
చైత్యభూమి
దీక్షభూమిలపై
అక్షర నక్షత్ర ప్రవాహాన్ని
కురిపిస్తూనే ఉంది..!
అంబేద్కర్
ఓ ఆలోచనల బిగ్ బ్యాంగ్..!
ఆ చూపుడు వేలు
దశాబ్దాలుగా కాల శాంతి వనంలో
నవతరపు ప్రేమ విప్లవమై
అసమానత వివక్షతలపై
ప్రపంచ యుద్ధం
ప్రకటిస్తూనే ఉంది…!
నో ప్యూన్ నో వాటర్
నినాదపు కాంతిపుంజం
శూన్యపు దారుల్లో
విశ్వ సరిహద్దుల్ని
కంపింపజేస్తూనే ఉంది..!
డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్
భారతరత్నపు పుడమిగీతమై
మన రాజ్యాంగ నిబద్ధత
ప్రజాస్వామ్య గ్రావిటీతో
లౌకికతత్వ ఆర్బిట్ లో
మరణం లేని భ్రమణం
చేస్తూనే ఉంది..!
జై భీమ్
నేటి నా దేశపు
విభిన్నతలోని
ఏకత్వపు నీలి జెండా
పేదరికపు సంగ్రామంలో
బానిసత్వపు రణంలో
అంబేద్కర్”చదువు”పోరాటం
అజరామరం..!
అభ్యుదయ శతాబ్దం..!!
అన్నింటికన్నా దేశమే మిన్న
ఆయన సందేశం
నేడు మన దేశ గుండె సవ్వడి
జాతీయ పతాకం..!
కులాల మతాలకతీతమైన
మన రాజ్యాంగపు
విద్యోదయపుజి
విశ్వ వికాసం
జగతి పరిణామపు
పాఠ్యపుస్తకం..!
– ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536
ఆలోచనల బిగ్ బ్యాంగ్..!
- Advertisement -
- Advertisement -



