- Advertisement -
వ్యక్తికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామ శివారులోనీ పద్మావతి గార్డెన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక వివరాల ప్రకారం శంకర్, నరేష్ అని ఇద్దరు వ్యక్తులు కల్వకుర్తి నుండి దేవరకొండకు బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ అనే వ్యక్తికి కుడి చేయి విరిగింది. చికిత్స కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.
- Advertisement -