జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. బుక్‌ఫెయిర్ సందర్శన
నవతెలంగాణ – ముషీరాబాద్
వివిధ రకాలైన విరుద్ధ భావజాలాలను ప్రజలకు చేరువ చేయడమే పుస్తక ప్రదర్శనల ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బుక్ ఫెయిర్ గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఆయన శనివారం సందర్శించి, పలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన విభిన్న అభిప్రాయాలు, భావజాలాలకు వేదికగా నిలిచిందని ప్రశంసించారు. ప్రదర్శనశాల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉందని తెలిపారు. ఒకే ప్రాంగణంలో గాంధీ, మార్క్స్ తదితర భిన్న ధృవాలైన ప్రముఖుల రచనలు అందుబాటులో ఉండటం అభినందనీయమన్నారు. ఈ బాధ్యతను నిర్వాహకులు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన గద్దర్ ఫౌండేషన్, వీక్షణం, నవోదయ బుక్ హౌస్, లిఖిత ప్రెస్ బుక్ హౌస్, పెంగ్విన్, ఓరియంట్ బ్లాక్ స్వాన్‌లో పలు పుస్తకాలు కొనుగోలు చేశారు. అలాగే క్యాస్ట్ ఇన్ మోడెర్న్ ఇండియా, ఫైజ్ అహ్మద్ ఫైజ్ మొదలగు పుస్తకాలనూ కొనుగోలు చేశారు.
విభిన్న అభిప్రాయాలు, భావజాలాల వేదికగా పుస్తక ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



