Monday, June 23, 2025
E-PAPER
Homeఆటలుమెరిసిన ముజాహిద్‌ అలీ ఖాన్‌

మెరిసిన ముజాహిద్‌ అలీ ఖాన్‌

- Advertisement -

– 11వ తెలంగాణ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌
హైదరాబాద్‌:
11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గచ్చిబౌలిలోని శాట్జ్‌ షూటింగ్‌ రేంజ్‌లో ఆదివారం పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 107 మంది షూటర్లు పోటీపడగా.. అర్ణవ్‌ బడియా 378/400 స్కోరుతో మెప్పించాడు. ట్రాప్‌ విభాగంలో 28 మంది అథ్లెట్లు గన్‌ గురి పెట్టగా.. మహ్మద్‌ ముజాహిద్‌ అలీ ఖాన్‌ 40/50 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. పిస్టల్‌, ట్రాప్‌ ఈవెంట్లకు హాజరైన తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఏ) అధ్యక్షుడు అమిత్‌ సంఘీ షూటర్లతో మాట్లాడుతూ వాళ్లలో ఉత్సాహం నింపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -