Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యదర్శులపై పండుగ భారం.!

కార్యదర్శులపై పండుగ భారం.!

- Advertisement -

బతుకమ్మ, దనరా నిర్వహణ బాధ్యతలు
గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత
సొంత డబ్బులతో విద్యుత్ దీపాలు, మైదానాల చదును
నవతెలంగాణ – మల్హర్ రావు

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నదంచంగా మారింది మండలంలోని పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు పంచాయతీ కార్యదర్శులే చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు. జీపీల్లో నిధుల కొరత చెపిస్తుండగా అధికారుల ఒత్తిళ్లతో సొంత కుబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. మండలంలో 15 గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఇంటి, నల్లా, వాణిజ్య సముదా మాల పన్ను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన అనంతరం నిధులు విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పావిశుధ్య ట్రాక్టర్లకు డిజిల్,మరమ్మతులకు వారానికి రూ.4 నుంచి రూ.5 వేల వరకు కార్యదర్యులు వెచ్చిస్తున్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ, పారిశుధ్య పనులు, బోర్లు, పైపు లైన్ల లీకే జీల మరమ్మతులకు నెలకు రూ.10వేల వరకు సాంతంగా ఖర్చు పెడుతున్నారు.
పండుగల నిర్వహణ ఎలా?

గ్రామ పంచాయతీల్లో నిధులు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు ఏర్పాట్లు ఎలా చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా వీధిలైట్లు, ప్రధాన చౌరస్తాలతో పాటు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఎల్ఈడి సీరియల్ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చిన్న గ్రామాల్లో రూ.30వేల నుంచి రూ.40వేలు, పెద్ద గ్రామాల్లో రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు విధి లైట్లకు ఖర్చు చేయాల్సి వస్తుందని కార్యదర్యులు పేర్కొంటున్నారు.దసరా రోజున జమీపూజ ఇతర కార్యక్రమాలకు ఒక్కో గ్రామపంచాయతీలో రూ.2 మే వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు బస్సు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ పలు గ్రామాల్లో బతుకమ్మ అదే మైదానాలను చదును చేస్తున్నారు.రోడ్లపై చెత్త,చెదారం పూడ్చివేస్తున్నారు. డ్రైనేజీల్లో చెత్త,చెదారం తొలగిస్తున్నారు.ప్రభుత్వం నిధులు మంజూరు చేయకండా ఎలా ఏర్పాట్లు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పండుగల నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -