ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు
నవతెలంగాణ జన్నారం
అధిక వర్షాలకు జన్నారం బస్టాండ్ ఆవరణ ముందు లోతైన గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బస్సుల కింది భాగం నేలకు తగిలేంత లోతుగా గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గుంతలను పూడ్చాలని వారు కోరుతున్నారు. జన్నారం బస్టాండ్ ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ జిల్లాలకు వెళ్లే ప్రధాన మార్గమధ్యలో ఉండడంతో రోజు వందలాది బస్సులు వస్తు పోతూ ఉంటాయి, ఎలా అది మంది ఈ బస్సులలో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. బస్టాండ్ ముందు గుంతలు పడడంతో బస్సులు నడిపే డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారుతుంది. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ లో గుంతలు కూర్చి ప్రయాణికుల ఆర్టీసీ డ్రైవర్ల ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు డ్రైవర్లు కోరుతున్నారు.
గుంతలమయంగా జన్నారం బస్టాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


