Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజార్ఖండ్‌లో ఇద్ద‌రు బీజేపీ ఎంపీల‌పై కేసు ఫైల్

జార్ఖండ్‌లో ఇద్ద‌రు బీజేపీ ఎంపీల‌పై కేసు ఫైల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జార్ఖండ్‌ లో ఇద్ద‌రు బీజేపీ ఎంపీల‌పై కేసు న‌మోదైంది. ఆగస్టు 2న బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే , మనోజ్ తివారీ లు కలిసి దేవఘర్‌లోని బైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఆంక్షలు ఉన్నప్పటికీ గర్భగుడిలోకి బలవంతంగా ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంపీలు మతపరంగా భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని, వారి వల్ల ఆలయం బయటకు తొక్కిసలాట జరిగిందని, వారిపై వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ పూజారి ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన బైద్యనాథ్ మందిర్ పోలీసులు ఎంపీలు నిషికాంత్ దుబే, మనోజ్ తివారీ, కంషికానాథ్ దుబే, శేషాద్రి దుబే, ఇతరులపై బీఎన్ఎస్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img