- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో గల ఎస్సీ స్మశాన వాటిక కబ్జాకు గురైతుందని, కబ్జా కోరల నుండి స్మశాన వాటికను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. సర్వేనెంబర్ 241/2 గల 40 గుంటల ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించారు. ప్రభుత్వం ద్వారా సర్వే చేసి స్మశాన వాటికకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పు వెంకటయ్య, బూత్కురి మల్లేష్, కొప్పు హరి ప్రసాద్ ,బచ్చలకూర కృష్ణయ్య, కొప్పు మల్లేష్,శివ కొప్పు ,శివ, మధు, నిరంజన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -