రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలతో కలిసి సీఎం ఢిల్లీలో పోరాడాలి : వనపర్తి జిల్లా వీపనగండ్లలో పెద్ద రాములు సంస్మరణ సభలో
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వీపనగండ్ల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా వీపన గండ్ల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పెద్ద రాములు సంస్మరణ సభ ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానం చేసిందని తెలిపారు. దాన్ని గవ ర్నర్ ఆమోదం కోసం పంపితే.. ఆయన దాన్ని ఆమో దించకుండా పెండింగ్‌లో పెట్టారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు బీసీ రిజర్వేషన్లు అమలు కోసం బంద్ చేపడితే బీజేపీ కూడా రాష్ట్రంలో బంద్‌లో పాల్గొనడం బీసీల ను మోసం చేస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలూ ఉన్నారని, అందుకే అమలు చేయడం లేదని గతం లో బండి సంజరు ప్రకటించడం దారుణమన్నారు. ముస్లింలోనూ వెనుకబడ్డ పేదలు ఉన్నారని, వారికీ వాటా ఇవ్వడంలో తప్పులేదని, మతం పేరుతో రిజర్వేషన్లు అడ్డుకుంటూ ప్రజల మధ్య చిచ్చుపెడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు.. మన రాష్ట్రంలో ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర సీఎం బీసీ రిజర్వేషన్లు తీర్మానం చేసి పంపడం కాకుండా రాష్ట్రంలో కలిసొచ్చే అఖిలపక్ష పార్టీలతో ఢిల్లీలో పోరాటానికి నాయకత్వం వహించాలని సూచించారు. దానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి మరిచిందని అన్నారు. నిరుద్యోగ జేఏసీ ఉద్యోగాల కోసం చేపట్టే ఆందోళన పోరాటాలకు సీపీఐ(ఎం) మద్దతు తెలుపుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్, జీఎస్ గోపి, రాజు మండల కార్యదర్శి డి.బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



