Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంవిమాన టికెట్ల ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

విమాన టికెట్ల ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌లు రోజుల నుంచి ఇండిగో విమానాల సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయా ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు తీవ్ర అవ‌స్థలు ప‌డుతున్నారు. ఆక‌స్మీక ప‌రిణామంతో విదేశీ ప్ర‌యాణీకులు కూడా సొంత దేశానికి వెళ్ల‌లేక ప‌లు రోజుల‌నుంచి విమానాశ్ర‌యాల్లో ప‌డిగాపులున్నారు. అదే విధంగా ఎయిర్ పోర్టుల ఎదుట‌ ప‌లువురు ప్ర‌యాణీకులు బైటాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. మ‌రోవైపు ఇండిగో సంక్షోభాన్ని ఆదునుగా భావించి ఇత‌ర విమానాల సంస్థ‌లు విచ్చిల‌విడిగా టికెట్ల రేట్లు పెంచాయి. దీంతో ప్ర‌యాణికుల్లో ఆగ్ర‌వేశాలు పెల్లుబికాయి. భారీ యోత్త‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయా సంస్థ‌ల‌పై విమ‌ర్శ‌లు వెలుత్తాయి. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తమైన కేంద్ర ప్ర‌భుత్వం టికెట్ల రేట్ల‌ను నియంత్రిస్తూ ప‌లు మార్గాలు విడుద‌ల చేసింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది

ఆర్‌సీఎస్‌-యూడీఏఎన్‌ (RCS-UDAN) విమానాలు, బిజినెస్‌ క్లాస్‌కు ఈ ఛార్జీలు వర్తించవని కేంద్రం వెల్లడించింది. ధరల స్థిరీకరణ జరిగేవరకు లేక తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని వెల్లడించింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎకానమీ క్లాస్‌లో కి.మీ.వారీగా గరిష్ఠ ఛార్జీలు ఇలా..

500కి.మీ వరకు - రూ.7,500
500-1000కి.మీ - రూ.12,000
1000-1500కి.మీ - రూ.15,000
1500కి.మీ.దాటితే - రూ.18,000
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -