Friday, October 17, 2025
E-PAPER
Homeజిల్లాలుబీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి

బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు  
నవతెలంగాణ – వనపర్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 402 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలు పరచాలని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 17న అంబేద్కర్ చౌక్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా, కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటున్న దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి పరమేశ్వర్ ఆచారి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ పాల్గొని ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్లపై బిజెపి నాటకం ఆడుతుందని, కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో బందుకు మద్దతు అంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు.

ఈ ద్వంద వైఖరి బిజెపి మానుకొని కేంద్రంలో బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై బీసీ జేఏసీ పోరాడితేనే 18న రాష్ట్ర బంద్ కు సీపీఐ(ఎం) మద్దతిస్తుందని లేదంటే స్వతంత్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అఖిలపక్షం నిర్వహించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని అన్నారు. బిజెపి ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్స్ బిల్లులు, ఆర్డినెన్స్ లు అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బందుకు బిజెపి మద్దతు ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బందులో పాల్గొంటామని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు కోసం కులగణన చేసిందన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు. అయినా ఆరు నెలలైనా ఆమోదించలేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 ని విడుదల చేసిందని, జీవో నెంబర్ 9 కి వ్యతిరేకంగా హైకోర్టుకు కొందరు వెళితే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటీషన్ను సుప్రీంకోర్టు తీరస్కరించిందన్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందన్నారు. బీసీ రిజర్వేషన్స్ అమలు పూర్తి బాధ్యత, బీసీ రిజర్వేషన్స్ పై రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చేర్చితే ఏ సమస్య ఉండదన్నారు. బీసీలు అర్థం చేసుకోవాలని, బిజెపి ఏ లా అడ్డుకుంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటూనే అమలు చేయాల్సిన బాధ్యత అమలు చేయకుండా మేము మద్దతు అని బిజెపి అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. ఈ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అక్టోబర్ 18న జరిగే బీసీ జేఏసీ తెలంగాణ బందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందన్నారు. బిజెపి మద్దతు ఇచ్చిందన్నారు. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.రాజు, ఏ.లక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు డి. కురుమయ్య, మదన్, గంధం గట్టయ్య, జి. బాలస్వామి, రమేషు, జి రాబర్ట్, సాయిలీల, బాలపీరు, ఉమా, నందిమల్ల రాములు, ఎల్లయ్య, దేవరాజు, మద్దిలేటి, జి భాస్కర్, డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -