నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిసి రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9 లో చేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవో జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్లెం కృష్ణ, ఏషాల అశోకులు మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వారు 1931 సంవత్సరంలో చేసిన కుల జన గణన తప్ప స్వాతంత్ర అనంతరం ఇప్పటివరకు ఏ ప్రభుత్వము కులగనన చేపట్టలేదని కేవలం జనాభా లెక్కల తీస్తున్నారని చివరగా 2011 సంవత్సరంలో చేపట్టారని అన్నారు.
దేశవ్యాప్తంగా వస్తున్న సామాజిక ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల తో పాటు కులగణన చేపడతామని జూన్ 4, 2025 ప్రకటించిందనీ వెంటనే కేంద్ర ప్రభుత్వం కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిది లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 103 వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి బిల్లు తెచ్చి రిజర్వేషన్ అమలు చేస్తున్న విధంగా 2025 సంవత్సరంలో కుల జనగణన చేసి తమాషా ప్రకారంగా బీసీలకు 50 శాతం పైగా గా విద్యా ఉద్యోగ చట్టసభలలో రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కమిషన్ ఏర్పాటు చేయాలనారు.
బీసీలకు కేంద్ర క్యాబినెట్లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బీసీలకు దళితులకు పక్క ఇండ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలనారు. విద్య అక్కు చట్ట ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి తేవాలనారు. బిసిల ఆర్థిక అభివృద్ధికి చేతివృత్తుల వారికి చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి చిరు మధ్యతరహా వ్యాపారాలకు ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు 50 శాతం సబ్సిడీలతో కూడిన రుణాలు మంజూరు చేయాలి ఎందుకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఉండాలనారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకులు కస్తూరి బిక్షపతి, జల్ది రాములు, సోమన సబిత, పుట్ట రమేష్, అనమైన వెంకటేష్, చింతల పెంటయ్య, చొప్పరి సత్తయ్య లు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES