Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం 

గ్రామాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి 
నవతెలంగాణ- మిడ్జిల్ 

గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంక్షేమ పథకాలు పేదలకు అందించెనే ప్రభుత్వాల లక్ష్యం నెరవేరుతుంది బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో మిడ్జిల్ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ తో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పాలమూరు ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. 

భవిష్యత్తులో డబల్ ఇంజన్ సర్కార్ మన తెలంగాణలో కూడా  ప్రభుత్వం రాబోతుందని ఆయన భీమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, శేఖర్, నరేష్, మండల ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆంజనేయులు చిల్వేర్ గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, రామ్మోహన్, ప్రేమ్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -