Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రమే అడ్డుపడుతోంది: మంత్రి శ్రీధర్ బాబు

బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రమే అడ్డుపడుతోంది: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
బీసీ రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మండల కేంద్రమైన  తాడిచెర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదం లభించలేదన్నారు.

బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్ లో నిర్ణయించి ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ, ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదంలో జాప్యానికి నిరసనగా 5,6,7 తేదీలలో ముఖ్యమంత్రి అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అప్పుడు బీసీ రిజర్వేషన్ చట్టం చేయకుండా ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ లబ్ధి కోసమే నిందలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వారికి బీసీ రిజర్వేషన్ ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట.రాజబాబు,పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి,పిఏసిఎస్ డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గేం రమేష్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -