నవతెలంగాణ – భిక్కనూర్
44వ జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ గుంతను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి స్వయంగా తానే మట్టితో పూడ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నుండి భిక్కనూర్ కి వస్తున్న చైర్మన్ మెదక్ జిల్లా రామాయంపేట్ వద్దకు చేరుకోగానే బైపాస్ 44వ జాతీయ రహదారిపై భారీ గుంత కారణంగా వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి వాహన టైర్లు పగిలిపోయాయి. తనకు జరిగిన ప్రమాదం మరొకరికి జరగకూడదని మానవతా దృక్పథంతో స్థానికంగా ఉన్న హోటల్ వద్ద నుండి మట్టిని తీసుకొని గుంతను పూడ్చారు. జాతీయ రహదారి అధికారులకు విషయాన్ని తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. జిల్లా చైర్మన్ స్వయంగా మట్టిని పూడ్చి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకొవడం పట్ల ప్రజలు అభినందించారు.
రహదారిపై గుంతను పూడ్చిన చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES