Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి..

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలలో వచ్చినా హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెస్ పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్,హనంకొండ, జనగామ జిల్లాల ఇన్చార్జి వై కే విశ్వనాథ్, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి హనుమకొండ జిల్లా ఇన్చార్జి సోమన్న డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఎం ఎస్ పి హనంకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి గంగారపు శ్రీనివాస్ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈనెల 7న హసన్పర్తి మండలం చింతగట్టులో గల ఏంన్టీఆర్ గార్డెన్లో వికలాంగుల, చేయూత, పెన్షన్ దారుల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటైన వికలాంగుల , వృద్ధుల , వితంతువుల , ఒంటరి మహిళల , చేనేత , బీడీ , గీత కార్మికుల పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగిందని,ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారంలో వికలాంగలకు రూ.4000 పెన్షన్ ఉంటే రూ.6000 చేస్తానని,వృద్ధులు,వితంతువులు,ఒంటరి మహిళలు,చేనేత,బీడీ,గీత కార్మికులకు రూ.2000 ఉన్న పింఛన్లు రూ.4000 చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఇప్పటికీ ఒక్క రూపాయి పెన్షన్ పెంచకపోగా నాలుగు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడని పెన్షన్ దారులను నమ్మించి మోసం చేశాడని ఎద్దేవ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు సోంపల్లి అన్వేష్, పుట్ట ప్రశాంత్, సింగారపు పవన్,చిలుక రాజ,కొట్టే శంకర్ ,బొడ్డు ప్రణయ్, నక్క పవన్, కె బుచ్చిరాములు, చిలుక మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -