Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజైళ్లశాఖ డైరీని ఆవిష్కరించిన సీఎం

జైళ్లశాఖ డైరీని ఆవిష్కరించిన సీఎం

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర జైళ్ల శాఖ నూతన సంవత్సర 2026 డైరీతో పాటు క్యాలండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. అదే సమయంలో జైళ్లశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలతో పాటు జైళ్లశాఖ పరిశ్రమల యూనిట్‌ సాధించిన ప్రగతి, మహిళా ఖైదీల సంక్షేమం పట్ల తీసుకున్న చర్యల గురించి ఈ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) డాక్టర్‌ సౌమ్యామిశ్రా ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. అలాగే డైరీలో జైళ్లశాఖ విధివిధానాలు మొదలుకొని ఖైదీలలో తీసుకొస్తున్న మార్పుల గురించి వివరించామని ఆమె తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలను సౌమ్యామిశ్రాతో పాటు జైళ్ల ఐజీ మురళి, డీఐజీ సంపత్‌లు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -