రోహిత్ హీరోగా, అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా ‘మిస్టీరియస్’. రియాకపూర్, మేఘనా రాజ్‌పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి ఈ చిత్ర విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
అన్ని సినిమాల్లా రెగ్యులర్ ఫార్మెట్‌లో కాకుండా.. విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కించాం. ఈ సినిమాలో క్రైమ్‌తో పాటు లవ్, క్రష్ ఉంటాయి. వీటితో పాటు థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. వీటికి ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారు. ఇప్పటి వరకు ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలను ఏ సినిమాలోనూ చూపించలేదు. చివరి వరకు సినిమాలో కిల్లర్ ఎవరు అనేలా.. సస్పెన్స్‌గానే సాగుతుంది.
ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరూ ఊహించిని విధమైన ఓ ట్విస్ట్‌తో సస్పెన్స్ ప్లస్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమా అయిపోయక అందరూ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునేలా ఉండబోతుంది. థ్రిలర్ మూవీస్ అంటే.. పాటలు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. కానీ, మా సినిమాలో కథను బట్టి మూడు పాటలు పెట్టడం జరిగింది. ఈ మూడు పాటలు కూడా సరిగ్గా సరిపోయాయి. ప్రేక్షకుడు మొత్తం క్రైమ్ సినిమానే చూస్తున్నాడు అనే ఫీల్ రాకుండా.. డిస్ట్రర్బ్ అవ్వకుండా.. మధ్యలో వచ్చే పాటలు కూడా మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయి. ఆ పాటలకు మా సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఛాట్ బస్టర్ మ్యూజిక్ అందించారు. పోలీస్‌ల గొప్పదనం చెప్పేలా రూపొందించిన అడుగు అడుగునా సాంగ్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో రిలీజ్ చేయించాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలతో పాటు మా సినిమాలో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది.
క్లైమాక్స్ గుర్తుండిపోతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



