నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటి నుండే కష్టపడి పని చేస్తే 2028 అధికారం మనదేనని కూటమి అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, సెక్రటరీ జనరల్ మాజీ ఏమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కన్వీనర్లు డాక్టర్ ఈడా శేషగిరిరావు, రామావత్ లాలు నాయక్, డేవిడ్ ఆంధ్ర్యూ పిలుపు ఇచ్చారు. మంగళవారం లోక్ దళ్ పార్టీ కార్యలయంలో జరిగిన రాజకీయ శిక్షనా తరగతుల్లో వారు మాట్లాడుతూ.. BRS Congress BJP పార్టీలు అవినీతి బంధు ప్రీతీ కుటుంబ రాజకీయాలకే పరిమితం అయి ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ పది గ్యారంటీలతో తెలంగాణ పేద ప్రజల బ్రతుకులు మారుతాయని కూటమి నేతలు హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా కూటమి జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు అడ్వకేట్ ఎస్ శరత్ కుమార్ అవినీతి రహిత తెలంగాణ సాధన అంశంపై మాట్లాడుతూ.. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పది రేట్లు దుర్మార్గుడు దోపిడి దారుడు. ఇలాంటి తెలంగాణ ద్రోహుల నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడానికి తాను నిజాయితీ పరులు విద్యావంతులైన తెలంగాణ రాజకీయ కూటమి నేతలను బలపరుస్తున్నానని ప్రజలు కూడా మద్దతు ఇచ్చి అధికారం ఇవ్వాలని కోరారు.

ఈ శిక్షణలో వక్తగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విట్టల్ మాట్లాడుతూ.. నాయకుడంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి ప్రజలను ప్రేమించాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ దోపిడీ దారులని అవినీతి తిమింగిలలు. వారి నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలంటే తెలంగాణ రాజకీయ కూటమి లాంటి ప్రత్యామ్నాయం కావలని సంకల్పం ఉంటే సాధ్యం కానిది రాజకీయాల్లో లేదని మ్మెల్యేలు కావడం కష్టమేమి కాదని కాన్షిరాం కేజ్రీవాల్ నిరూపించారని సామజిక తెలంగాణ సాధన కోసం మీతో కలిసి ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడత శిక్షణ లో 70 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.




