Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వడాయిగూడెంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్..

వడాయిగూడెంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పు  పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో మొత్తం ఎన్ని  ఉన్నాయని, అవి ఏ ఏ దశలో ఉన్నాయో  సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ఇంకా ప్రారంభం కానీ ఇండ్లు ఎన్ని ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగారు.   ఎందుకు మొదలు పెట్టలేదని అడిగారు వాళ్ళకి ఆర్ధిక స్థోమత సరిగా లేక మొదలు పెట్టలేదు అని పంచాయతీ సెక్రటరీ కలెక్టర్ కు చెప్పడం  జరిగింది. ఇంటి ప్రారంభానికి వాళ్ల చేతిలో డబ్బులు లేకపోతే స్థానిక మహిళా సంఘాల సభ్యులకు చెప్పి సంఘం నుండి రుణాలు ఇప్పించాలని అన్నారు.ఏఈ లు కూడా ఆలస్యం చేయకుండా వెంట వెంటనే ఫోటో తీసి అప్లోడ్ చేస్తే లబ్ధిదారుల అకౌంట్ లలో వెంటనే డబ్బులు జమ అవుతాయ అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad