నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న కుక్కలు ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. ఆ వింత ఫోటోలను ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ (Dogs of Chernobyl)’ అనే స్వచ్ఛంద సంస్థ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
1986లో చెర్నోబిల్ అణు విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తర్వాత మానవులు ఎవరూ అక్కడ నివసించడంలేదు. కాలక్రమేణా ఆ ప్రాంతం జంతవులకు ఆవాసంగా మారిపోయింది. ఈక్రమంలో అక్కడ ఉన్న కుక్కల రంగు బ్లూ గా మారిపోయింది. అయితే పారిశ్రామిక రసాయనాలు లేదా పర్యావరణంలోని భారీ లోహాల ప్రభావం కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరించే పనిలోపడ్డారు.



