- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కాదని అది దేశ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉందని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ట్రస్మా మండలాధ్యక్షులు, పాఠశాల ప్రిన్సిపల్ కే. రవీందర్ చెప్పారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దుబ్బాక లోని సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసే స్మరించుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పలువురున్నారు.
- Advertisement -


