- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ …. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా.. రాజ్యాంగానికి లోబడి ఉన్నామన్నారు. రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఇది అని చెప్పారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను కల్పించిందన్నారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు అని తెలిపారు. సామాజిక న్యాయం సాధనలో భాగమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని ద్రౌపది ముర్ము అన్నారు.
- Advertisement -


