– కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని హక్కులను దేశానికి అందించిన భారత రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తున్న మనువాదుల నుంచి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, టీపీ ఎస్‌కే రాష్ట్ర కన్వీనర్ జీ రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు75 వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ బాగ్ లింగం పల్లి సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను చేబూని సమూహంగా చదివారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. మధ్యయుగాల కాలం నాటి మను ధర్మం వైపు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడానికి దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో కషి జరుగుతున్నదన్నారు దీనివల్ల దేశంలో పేదల మధ్య అనైక్యత, అసమానతులు సష్టించి సాటి మనిషిని మనిషిగా చూడలేని నీచత్వం వైపు ప్రయాణం చేస్తుందన్నారు. ఈ దేశాన్ని ఏలుతున్న మనువాద పాలకుల విధానాలు ప్రజలకు శాపంగా మారాయని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వ్యక్తి గౌరవం ఆత్మగౌరవంతో తలెత్తి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని, ఆర్టికల్ 21(ఏ )విద్యా హక్కు ఆరు నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య నేర్పుట ప్రభుత్వ బాధ్యత అని పేర్కొందన్నారు. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించిందని అయినప్పటికీ దేశంలో దళితులపై దాడులు దౌర్జన్యాలు సాంఘీక బహిష్కరణలు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ 12ఏండ్ల పాలనలో దళితులపై 300 రెట్లు దాడులు దౌర్జన్యాలు, లైంగికదాడులు, హత్యలు పెరిగాయని చెప్పారు. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై లైంగికదాడులు, హత్యలు పెరిగాయన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం హత్యల్లో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. రేప్ కేసుల్లో మధ్యప్రదేశ్ ప్రధాన స్థానంలో ఉందన్నారు. డప్పు కొట్టినందుకు జేఎన్‌టీయూ గోల్డ్ మెడలిస్టు సాధించిన దళిత విద్యార్థి కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. భావి భారత పౌరులకు ఎదగాల్సిన పిల్లలు చదువులేకపోతున్నారని కార్మికులుగా మారుతున్నారన్నారు ఈ విధానాలపై రాజ్యాంగ రక్షణకు కేవీపీఎస్‌గా ప్రజలను కలుపుకొని చైతన్యవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ సభ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ నగర నాయకుడు ఎం మహేందర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు శ్రావణ్, ఎండీ సత్తార్, మహేష్ దుర్గి, ఇందిర అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు సురేష్ కేవీపీఎస్ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.
మనువాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి : వక్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



