Thursday, January 8, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

మహిళా దినోత్సవంలోగా అందుబాటులోకి తీసుకురావాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఐఎంఎస్ భవన నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ. ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణ ప్లాన్ లను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి కాగా, గోడల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అన్ని గదులు పరిశీలించి.. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో ఆరా తీశారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భవన పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచి మార్చి 08వ తేదీలోగా పూర్తి చేయాలని ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డిని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో  జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఈ సతీష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -