డిఆర్డిఓ పీడీ వసంత
నవతెలంగాణ-పాలకుర్తి
మండల కేంద్రంలో గల ఎస్ఎల్ఎన్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ అనుసంధానం డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిఆర్డిఓ పిడి వసంత అధికారులను, గుత్తే దారులను ఆదేశించారు. సోమవారం ఎస్ఎల్ఎన్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ తో పాటు డైనింగ్ హాల్ ను డిఆర్డిఓ అదనపు పీడి నూరోద్దీన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. డైనింగ్ హాల్ నిర్మాణ పనులు నిర్లక్ష్యం తగదన్నారు. పనుల నిర్మాణంలో పురోగతి ఉండాలని ఆదేశించారు. రెండు నెలలుగా డైనింగ్ హాల్ నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ప్రకాష్, ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, మండల సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, సీసీ కారుబోతుల వెంకటేశ్వర్లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES