Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్య ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది

విద్య ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది

- Advertisement -

– అన్ని దానల కంటే విద్యాదానం గొప్ప..
– తోగుట సిఐ షేక్ లతీఫ్..
– అక్షర జ్ఞానంతోనే సమాజ మార్పు..
– ఎంఈవో సత్యనారాయణరెడ్డి..
నవతెలంగాణ – రాయపోల్ 

అన్ని దానాలకంటే విద్యాదానం మహా గొప్పదని విద్య ధారణ దేశం అభివృద్ధి చెందుతుందని సమాజ మార్పు అక్షర జ్ఞానంతోనే సాధ్యమవుతుందని అలాంటి విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తాను చదువుకున్న పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తూ దాతృత్వం చాటుకున్న గంగి యాదగిరి ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తొగుట సిఐ షేక్ లతీఫ్, మండల ఎంఈవో సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి ప్రాథమిక పాఠశాలలో గంగి యాదగిరి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, టై బెల్ట్, ఐడి కార్డు, షూ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పిస్తే ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న మంచి గౌరవం గుర్తింపు విలువ పొందాలన్న చదువు ద్వారనే సాధ్యం అవుతుందన్నారు. కాబట్టి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని అది సాధించే వరకు శ్రమించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులే విద్యనభ్యసిస్తారని అలాంటి వారికి గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు అందరూ సహకారం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. తాను చదువుకున్న పాఠశాలకు తన వంతు సహకారం అందించి పాఠశాల అభివృద్ధి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చెయ్యాలనే సంకల్పంతో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, టై బెల్టు, ఐడి కార్డులు, షూ అందజేసినందుకు గంగి యాదగిరిని పాఠశాల పక్షాన ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులందరూ బాగా చదివి పై తరగతులకు వెళ్లాలని పాఠశాలకి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని యాదగిరి సూచించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు నాగరాజ్, ముత్యం రెడ్డి, నవీన్, హోంగార్డు దేవరాజ్,గ్రామస్తులు బిక్షపతి, కృష్ణ, కనకా రెడ్డి, దయాకర్ రెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -