– మధుయాష్కి గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆదివాసి, గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మదుయాష్కిగౌడ్ అన్నారు. గిరిజన యువతతో ఇంట్రాక్షన్ (వాలిడిక్టరీ) కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కిగౌడ్ పాల్గొన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వారం రోజులపాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్‌గఢ్. ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ యువకులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం గవర్నర్ కార్యాలయాన్ని సందర్శించారు. వారం రోజులపాటు తాము తెలుసుకున్న అంశాలను, నూతన ఆవిష్కరణలకు సంబంధించి వారి మధ్య జరిగిన చర్చలను గవర్నర్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్, మధుయాష్కీ అందజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ఇప్పటికీ గిరిజన ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు లేకపోవడం బాధాకరమన్నారు. సామాజిక ఆర్థిక అణిచివేత కారణంగా చాలామంది యువత నక్సలిజం వైపు వెళ్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాలు అభివద్ధి జరిగినప్పుడే దేశాభివద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారంలో ఎవరున్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం, తమ శ్రమకు తగ్గ ఫలితం కోసం ప్రశ్నిస్తూనే ఉండాలని సూచించారు. ఆదివాసి యువతకు ఉపాధి, ఉద్యోగాలు, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించినప్పుడే వారి అభ్యున్నతికి దోహదం చేసిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూత్ ఆఫీసర్ కుష్బు, రైల్వే బోర్డు మెంబర్ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసి, గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే దేశ ప్రగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



