Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎస్సీ సంస్థ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలి

సీఎస్సీ సంస్థ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలి

- Advertisement -

– తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీఎస్సీ సంస్థ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలనీ, భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు స్కీములను ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఇచ్చిన జీవో నెం. 12ను సవరించి, కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని వెల్ఫేర్‌ బోర్డు కార్యదర్శి ఈ గంగాధర్‌కు ఫెడరేషన్‌ అద్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్‌రావు, వంగూరు రాములు, కోశాధికారి ఏ రాజు, రాష్ట్ర నాయకులు చైతన్య, నరేష్‌, రవి, డీఎల్‌ మోహన్‌, బి స్వామి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కార్మికుల కార్డులు రెన్యూవల్‌, పెండింగ్‌ క్లెయిమ్స్‌కు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణానికి రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలకు పెంచుతూ, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ఈ మూడు స్కీములను ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు వేయాలని ప్రభుత్వం జీవో 12ను విడుదల చేసిందని గుర్తు చేశారు. జీఓ విడుదలైన రెండు రోజులకే ట్రెయిల్‌ ఆర్‌ అనే బ్రోకర్స్‌ సంస్థ ద్వారా రూ.346 కోట్లు ప్రయివేట్‌ బీమా కంపెనీలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని హెల్త్‌ టెస్టులు చేస్తూ రూ.500 కోట్లకు పైగా ఆ సంస్థకు ఇచ్చి వెల్ఫేర్‌ బోర్డు సెస్సు నిధులు దుబారా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, సీఎస్సీ సంస్థకు వందల కోట్లు కట్టబెట్టడం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం ఆ జీవో12ను సవరించి ప్రభుత్వమే వెల్ఫేర్‌ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని కోరారు. రెన్యూవల్‌ కాని 13 లక్షల మంది కార్మికుల లేబర్‌ కార్డులను యుద్ధప్రాతిపదికన రెన్యూవల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -