Tuesday, July 22, 2025
E-PAPER
Homeఖమ్మంమ్యాన్ హోల్స్ తో పొంచి ఉన్న ప్రమాదం.. 

మ్యాన్ హోల్స్ తో పొంచి ఉన్న ప్రమాదం.. 

- Advertisement -
  • – వినియోగం లోకి రాకమునుపే శిధిలం..
    – నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు..
    – పర్యవేక్షణ లేమితో సెంట్రల్ లైటింగ్ పనులు..
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో కోట్లాది వ్యయంతో నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్,డ్రైనేజీ నిర్వహణ, రోడ్లు విస్తరణ పనులు అధికారుల పర్యవేక్షణ కొరవడటం తో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చాడు అనేది ఆ నిర్మాణాలు శిధిలం అవుతున్న వైనం తెలుపుతుంది.
    • మ్యాన్ హోల్ కు వేసే సిమెంట్ మూతలు సైతం నాసిక్ రకంగా నిర్మించడంతో అవి వినియోగం లోకి రాక మునుపే ధ్వంసం అవడంతో వాటితో ప్రమాదం పొంచి ఉందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం – దేవరపల్లి రాష్ట్రీయ రహదారిలో పేరాయిగూడెం నుండి జంగా రెడ్డిగూడెం రోడ్ లోని కాకతీయ గేట్ వరకు నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్,డ్రైనేజీ నిర్వహణ,రోడ్డు విస్తరణలో నిర్మిస్తున్న డివైడర్ క్రాసింగ్ ల్లో పలుచోట్ల ఇప్పటికే ధ్వంసం అయ్యాయి.డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్  పై వేసే సిమెంట్ మూతలు సైతం లు మిగిలిపోతున్నాయి.

భవిష్యత్తు లో డ్రైనేజీ పై పాదచారులకు మ్యాన్ హోల్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.ఇదే విషయం అయి ఆర్ అండ్ బీ డీఈఈ ప్రకాశ్ ను వివరణ కోరగా  పరిశీలించి చర్యలు తీసుకుంటానని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -