Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోనే దేశ అభివృద్ధి సాధ్యం

చదువుతోనే దేశ అభివృద్ధి సాధ్యం

- Advertisement -

– దిశ కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి
– ‘ ఇగం నీళ్లతోనే స్నానాలు’ నవతెలంగాణ కథనానికి స్పందించి కేజీబీవీ హాస్టల్ లో విద్యార్థులకు గ్యాస్ సిలిండర్లు, స్టౌ అందజేసిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రవీందర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ : ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా గౌరవించబడతామని సమాజ మార్పుకి చదివే ఆయుధమని దిశ కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో “ఇగం నీళ్లతోనే స్నానాలు” నవతెలంగాణ కథనానికి స్పందించి కేజీబీవీ హాస్టల్ లో విద్యార్థులకు గ్యాస్ సిలిండర్లు, స్టౌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులాలు,ఎస్సీ, ఎస్టీ, కేజీబీవీ హాస్టలలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం వాతావరణం తీవ్రంగా చలి ఉందని కనీసం చలి నుండి రక్షణ పొందడానికి విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు కూడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హాస్టల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్తున్నారని ముందు ఉన్న హాస్టలలో మౌలిక వసతులు కల్పించండిన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుతూ ఈ మార్పు నేటి తరం విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.విద్యార్థులు చదువుతోపాటు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యార్థులందరూ లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. పదవ తరగతి చదివే విద్యార్థులు  కష్టపడి చదివి  పాఠశాలకు  తల్లిదండ్రులకు  పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని  సూచించారు.వంద ఉత్తీర్ణత సాధించారని కోరుకున్నారు.కేజీబీవీ హాస్టల్ సమస్యలను నవతెలంగాణ దినపత్రికలో ప్రచురించి సమాజానికి తెలియజేసిన జర్నలిస్టు పుట్ట రాజును ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్, ఇన్చార్జి ఎస్ఓ అనిత, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -