యుటిఎఫ్ మండలాధ్యక్షులు సుతారి పాపారావు
జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ పాఠశాలలో కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ – తాడ్వాయి
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో జరుగు ధర్నాను విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు గత రెండు సంవత్సరాల నుండి అమలు కానీ పిఆర్సి నివేదికను, పెండింగ్ లో ఉన్న డి ఏ లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అన్ని కేడర్ల బదిలీలు షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని పిఎస్ హెచ్ఎంలో ప్రమోషన్స్ కల్పించాలని అరగల ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ వెంటనే ప్రకటించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీవితాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ యు ఆర్ ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస బేసిక్ పే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. కొత్త జిల్లాలకు డిఇఓ పోస్టులు, ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఉపవిద్యాధికారులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు పాపారావు, డిటిఎఫ్ నాయకులు రేగలరేందర్ గుమ్మడి ప్రభాకర్ నారాయణ గోపాల్ లక్ష్మీ రేవతి సరోజన సునీత పద్మ ఉషారాణి కాటాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు బాణాలు సుధాకర్ అక్బర్ బాషా కోడూరు సమ్మయ్య రాజేష్ జైపాల్ మోహన్, విజయ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చేసే ధర్నాను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES