నెహ్రూ గురించి కూడా చర్చిద్దాం రండి : ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వందే మాతరంపై చర్చను తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందేమాతరం గేయంపై చర్చలో పాల్గొన్న ఆమె జాతీయ గేయంపై చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన, దేశం కోసం త్యాగాలు చేసిన సమరయోధులపై కొత్త ఆరోపణలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. జాతీయ గేయంపైనా రాజకీయాలు చేయటం సరికాదని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. వర్తమానం, భవిష్యత్తు గురించి చెప్పుకునేందుకు ఏమీ లేక మోడీ గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నిరాశలో ఉన్నారని ప్రియాంక తెలిపారు. .
నెహ్రూపై చర్చిద్దాం రండి!
ఈ సందర్భంగా మోడీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ తనదైన రీతిలో ఎదురుదాడికి దిగారు.. ”మీరు నెహ్రూ చేసిన తప్పులను, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన తప్పులను ఎత్తిచూపుతుంటారు. వందేమాతరంపై చర్చ చేసినట్లే, నెహ్రూపై కూడా చర్చిద్దాం. మీరు నెహ్రూ తప్పుల జాబితాను తయారు చేయండి. దానిపై పార్లమెంట్ లో విస్తృతమైన చర్చ నిర్వహిద్దాం” అని సవాల్ విసిరారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసమే చర్చ
- Advertisement -
- Advertisement -



