నవతెలంగాణ – అశ్వారావుపేట
ద్విష్టి అంటే కళ్లతో పడే దోషం.ఇదో నమ్మకం. దాన్ని దూరం పెట్టడానికి మన రైతుల సృజనాత్మకత హాలీవుడ్ – బాలీవుడ్ కి కూడా షాక్ ఇచ్చేలా ఉంది కదూ.. మండలంలోని నారంవారిగూడెం రైతు భోగి వీర్రాజు మాత్రం అందరి దృష్టినీ తన తోటి వైపు తిప్పే లా చేసాడు. కాకర తోట చుట్టూ రంగురంగుల చీరలు కట్టి ద్విష్టి నివారణ పేరుతో ఒకేసారి ఫ్యాషన్ షో… ఫార్మ్ హౌస్ షో రెండూ ఏర్పాటు చేశాడు!
నవతెలంగాణ ప్రతినిధి తోట దగ్గరకు వెళ్లగానే— “ఇది పంట నా? ఏదైనా పండుగ వేదిక గుడారం మా ” అని కాసేపు అయోమయం గురిచేసింది.
గతంలో వరిగడ్డి బొమ్మలకు పాత ప్యాంటు లు, షర్టులు వేసి దయ్యాలు ఎలా కనిపిస్తుందో మనుషులూ అలాగే కనిపించేలా పెట్టేవారు.
తరువాత ప్లెక్సీలు అందుబాటులోకి వచ్చాక పొలాల అంచుల్లో సినీ హీరోయిన్ పోస్టర్లు ఏర్పాటు చేసేవారు.
కానీ ఇప్పుడు…
చీరల తోరణాలు కట్టేసి కాకర తోటకు వీర్రాజు ‘విలక్షణ బ్యూటీ పార్లర్’ పెట్టేశాడు. “దీంతో ద్విష్టి దూరం… తోటకు డిజైన్ కూడా!” అని రైతు ధీమా.
ఆయన మాటల్లోనే…
“కాకర తోట కే ఇంత అందం అయితే… కాస్త జాగ్రత్తగా లేకపోతే పక్క పొలాలు కూడా ఈ చీరలే అడుగు తాయేమో!”
ఏమైతేనేం…
ద్విష్టి దూరమైందో లేదో తెలియదు,
కానీ దృష్టి అంతా మాత్రం ఈ తోట పైనే పడింది… అదే అసలు ద్విష్టి కదా…


