Thursday, January 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబీజేపీ నిరంతర ప్రయోగశాలగా విద్యారంగం!

బీజేపీ నిరంతర ప్రయోగశాలగా విద్యారంగం!

- Advertisement -

విద్యారంగంలో సంస్కరణలు గ్లోబల్‌ స్టాండర్డ్స్‌ వికసిత్‌ భారత్‌ నినాదాల పేరుతో ‘భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు 2025”ను తీసుకువస్తున్నది. ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణ పెంచేందుకు ఈ బిల్లు. ఇది రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే గాక, కార్పోరేటీకరణ, వ్యాపారీకరణను పెంచుతుంది. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఏర్పడిన యుజిసి, ఎఐసిటిఈ, ఎన్‌సిటిఈ వంటి సంస్థలు రద్దవుతాయి. ఇది విద్య ప్రయివేటీకరణ, కార్పోరేటీకరణ, కాషాయీకరణను మరింత వేగవంతం చేస్తుంది. ఈ బిల్లులోని అంశాలు ముందు పరిశీలించాలి.1. వికసిత్‌ భారత్‌ శిక్షా వినియమన్‌ పరిషత్‌: ఇది విశ్వవిద్యాలయాలను కళాశాలలు నియంత్రణ బాధ్యతలు చూస్తుంది. విద్యాసంస్థలు పాటించాల్సిన నిబంధనలను పర్యవేక్షిస్తుంది. 2. వికసిత్‌ భారత్‌ శిక్ష మానక్‌ పరిషత్‌: ఇది విద్యా ప్రణాళిక, సిలబస్‌, విద్యా ప్రామాణాలు, అకాడమిక్‌ వ్యవహారాలు నిర్ణయి స్తుంది. 3.వికసిత్‌ భారత్‌ గుణవత్త పరిషత్‌: ఇది విద్యాసంస్థలకు గుర్తింపు, ర్యాంకింగ్‌లను ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. నాణ్యత ప్రమాణాలను ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తుంది.

నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చినప్పటి నుండి భారత విద్యారంగాన్ని బీజేపీ నిరంతర ప్రయోగశాలగా మార్చేసింది. 2020 లోనే విద్యను సామాజిక హక్కుగా కాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన స్కిల్‌ ఉత్పత్తిగా నిర్ణయించింది. మల్టీ ఎంట్రీ ఎగ్జిట్‌ అకాడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ర్యాంకింగ్స్‌ అవుట్‌ కం బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ వంటి భావనలు విద్యార్థిని సంపూర్ణ వ్యక్తిగా కాకుండా కార్పోరేట్‌ మార్కెట్‌కు అవసరమైన తాత్కాలిక వనరుగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు-2025 ఈ విధానాలు అమలు చేయడానికి కేంద్రానికి సంపూర్ణ అధికారాలను ఇస్తుంది. 4. బిల్లులోని సెక్షన్‌ 3 ద్వారా ఏర్పాటు చేయనున్న వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ సంస్థ ఎన్‌ఈపి 2020 పేర్కొన్న ”రైట్‌ బట్‌ టైట్‌ రెగ్యులేషన్‌” భావనకు ప్రత్యేక రూపం. రాష్ట్ర ప్రభు త్వాలు యూనివర్సిటీలు స్వతం త్రంగా విధానాలు రూపొందించే అవకాశం ఉండదు. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలను అమలుచేసే కార్యాలయా లుగా మారిపోయాయి.

ఇది రాజ్యాంగంపై నేరుగా చేసే దాడి. సెక్షన్‌ 6 ప్రకారం నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీని పన్నెండు మందితో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు అంటే స్టేకహేోల్డర్లతో సంబంధం లేకుండా విద్యపై నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంది. ఇలా తీసుకోవడం ప్రజాస్వామ్య హత్య. సెక్షన్‌ 9 ప్రకారం పర్మినెంట్‌ ఇండికేటర్స్‌ బట్టి నిధులివ్వడం ఫలితంగా గ్రామీణ ప్రభుత్వ సామాజిక బాధ్యత కల్పన సంస్థలు వెనక్కి వెళ్తాయి. ఈ బిల్లు ప్రధానంగా చెబుతున్న స్వయం ప్రతిపత్తి అనే పదం వినడానికి బాగున్నా అది ప్రభుత్వ బాధ్యత నుండి తప్పుకోవడమేనని అర్థమవుతుంది. విద్యాసంస్థలు తమ నిధులను తామే సమకూర్చుకోవాలని (సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌) నిబంధన ఈ బిల్లులో విధించారు. దీనివల్ల ఫీజుల భారం భారీగా పెరుగుతుంది. ఇది గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రగా మారుతుంది.

కార్పొరేట్‌ గుత్యాధిపత్యంలోకి..
ఈ బిల్లు ప్రధాన లక్ష్యం విద్యను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకోవడానికి కార్పోరేట్‌, విదేశీ శక్తులు విద్యారంగంలోకి ఆహ్వానించడానికి దారులు తెరుస్తుంది. సమాఖ్య స్పూర్తికి ఈ బిల్లు విఘాతం కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య గురించి చట్టాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలతో సంప్రదించి రాష్ట్రాల ప్రాధాన్యతలు తగ్గకుండా నిర్ణయించాలి. కానీ, ఈ బిల్లును 2018లో తీసుకువచ్చిన సందర్భంలో అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, రాష్ట్రాలు వ్యతిరేకించాయి. మళ్లీ రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని సెక్షన్‌ 4,5 లు అధికార కేంద్రీకరణను తెలుపుతున్నాయి. ఈ సెక్షన్లు ప్రకారం దేశవ్యాప్తంగా ‘ఒకే సిలబస్‌ – ఒకే పరీక్ష’ ఒకే రకమైన విద్యా ప్రమాణాలు ఉండాలని కేంద్రం నిర్ణయిస్తుంది. దీని వల్లన విద్యారంగం గుత్తాధిపత్యంలోకి వెళ్తుంది. దాని వల్లన రాష్ట్రాల విద్యా బోర్డులు కేంద్రం ఆదేశాలు పాటించే సంస్థలుగా మారిపోతాయి.దీంతో వైవిధ్యం దెబ్బతింటుంది. స్థానిక చరిత్ర, ఆయా రాష్ట్రాల ప్రత్యేక సంస్కృతులు పాఠ్యపుస్తకాల నుండి తొలగించే ప్రమాదం ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ అనుకూల సిద్ధాంతాలు దేశమంతటా రుద్దే ప్రమాదం ప్రధానంగా విద్యలో స్వతంత్ర ఆలోచన తగ్గి ఒకే రకమైన ఆలోచన ధోరణి పెరిగి అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్‌ఈపి 2020లో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. కానీ దానికి భిన్నంగా సిలబస్‌ తయారీలో మాతృభాష దెబ్బతిని హిందీ లేదా ఇంగ్లీష్‌ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ భాషల్లో లోతైన అంశాలు కనుమరు గయ్యే అవకాశం ఉంటుంది. ఒకే సిలబస్‌ పెట్టినంత మాత్రాన అందరికీ సమాన విద్య అంద దు. మౌలిక సదుపాయాలు ల్యాబ్స్‌, కంప్యూటర్స్‌ ఉన్న కార్పోరేట్‌ స్కూల్స్‌ విద్యార్థులు, సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు ఒకేపరీక్ష పేపర్‌ను ఎదుర్కోగలరా? ఇది డిజిటల్‌ సామాజిక అంతరాన్ని ఇంకా పెంచుతుంది. డిజిటల్‌ పద్ధతిలో పాఠాలు భోదించే పరిస్థితి వస్తుంది.

యుజిసిని రద్దు చేయడం వలన మన యూనివర్సిటీలు నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నాయి. ఇది స్వయం ప్రతిపత్తితో నిధులు ఇచ్చేది. కానీ, ఈ బిల్లు ప్రకారం నిధులు విడుదల కేంద్రం ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వానికి అనుకూ లంగా చేసి విద్యా సంస్థలకు లేదా సామాజిక అంశాలపై చేసే విశ్వవిద్యాల యాలకు నిధులు నిలిపివేసి అవకాశం ఉంటుంది. దీంతో పూర్తిగా అకాడమిక్‌ స్వేచ్ఛ హరిస్తుంది. మరొక పక్క భారీగా ఫీజులు పెంచుకునే అవకాశం ప్రయివేటు, కార్పొరేట్‌ వ్యక్తులకు ఈ బిల్లు ఇస్తుంది. ప్రభుత్వ నియంత్రణ కూడా వీటిపై తగ్గుతుంది. తద్వారా ప్రయివేటు సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతాయి. పేద, మధ్య, సామాజిక తరగతులకు విద్య అందని ద్రాక్షగా మారుతుంది.

వ్యాపారీకరణ దిశగా విద్య
విద్య లాభపేక్షలేని సేవగా కాకుండా లాభదాయ వ్యాపారంగా మార్చేందుకు ప్రయివేటు పెట్టుబడులకు ఈబిల్లు బార్ల తెరుస్తుంది. అసమానతలు పెంచి సామాజిక వివక్షకు కారణమవుతుంది. ఎన్‌ఈపి 2020లోని ‘ఫిలాంత్రో పిక్‌ ప్రయివేట్‌ పార్ట్నర్షిప్‌’ను ఈ బిల్లు దీని ద్వారా చట్టబద్ధం చేస్తుంది. ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుని క్రమంగా విద్యారంగాన్ని లాభదాయకంగా మార్చి పూర్తి స్థాయిలో పీపీపీ మోడల్‌కు తీసుకెళ్లి భవిష్యత్తులో విదేశీ కార్పోరేట్‌శక్తులపరం చేసేందుకు ఈ బిల్లును ఉపయోగించుకుంటుంది.

ప్రయివేటు, మార్కెట్‌ విస్తరణకు అవకాశాలు కల్పించడమే కాకుండా విద్య పెట్టుబడిదారులకు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు, చట్టాలు ఉండకుండా చూసే నేపథ్యంలో బిల్లును తీసుకొని వస్తున్న స్థితి ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఒత్తిడిలో రాకుండా ప్రభుత్వ నిబంధనలో ఆంక్షలు పెట్టకుండా స్వతంత్ర నియంత్రణ సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించే చర్యలు ఈ బిల్లు ద్వారా ముందుకు వస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను సమానంగా చూడాలని, విదేశీ విద్యాసంస్థలకు ఇచ్చే రాయితీలను సంస్థలకు ఇవ్వాలనే విద్య పెట్టుబడిదారుల ఆలోచనలు సమాహారమే ఈ కేంద్రీకరణ బిల్లు.దీన్ని విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

టి.నాగరాజు
9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -