– ఊర్కొండపేట ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు
నవతెలంగాణ – ఊరుకొండ
వడ్డెరులంతా ఏకమై స్వాతంత్ర సమరయోధుడు.. మహనీయుడు వడ్డే ఓబన్న ఆశయాలను కొనసాగించాలని వడ్డెర సంఘం నాయకులు, ఊర్కొండపేట ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట, ముచర్లపల్లి గ్రామాలలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డె ఒబన్న 219వ జయంతినీ పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో వడ్డెర ముద్దు బిడ్డ, ఊర్కొండపేట ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు ఎక్స్ ఆర్మీ ఓర్సు చంద్రయ్య, జంగయ్య, మల్లయ్య, వేముల జంగయ్య, ఆంజనేయులు, ఈదమయ్య, పర్వతాలు, కుమార్, శ్రీనివాసులు అలకుంట వెంకటేష్, నరేందర్, ఓర్సు శివ, శివంజీ, గణేష్, శ్రీకాంత్, గణేష్, ముచర్లపల్లి సర్పంచ్ వినీత ధర్మేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సాయి రెడ్డి, వడ్డెర సంఘ నాయకులు దశరథం, లక్ష్మణ్, తిరుపతయ్య, అంజి, పురుషోత్తం, రాము, జగన్, గణేష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.



