వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ నెల్లికుదురు
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సైదులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సూపరిండెంట్ కు వినతి పత్రం సోమవారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించడం జరిగింది. ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కుటుంబ జీవన విధానం కోసం ఉపాధి పని చేసుకుంటూ ఉండేవారనీ సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తూ కనీస వేతనం 600 రూపాయలు రోజువారి కూలి ఇవ్వాలని ప్రభుత్వాలపై వ్యవసాయ కార్మికుల పోరాటాలు కొనసాగించడం జరుగుతుంది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి వంద రోజులు ఉన్న పనిని 60 రోజులకు కుదిస్తూ ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి ఒక కుట్ర చేస్తుందని ఆరాధన చెందారు.
ఈ పథకానికి కేటాయిస్తున్న బడ్జెట్ను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కుటిల ప్రయత్నం చేస్తుందని ఎం ఎన్.ఆర్.ఇజిఎస్ పేరును రద్దు చేస్తూ విబి జి రాంజీ చట్టం 2025 అనే కొత్త పేరును రూపొందిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.నూతనంగా ప్రవేశ పెడుతున్న వి బి జి. రాంజీ 2025 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నా ఆలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధికి దూరమై వలసలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనుల ద్వారా వ్యవసాయ కార్మికులు గిరిజనులు దళితులు పేద రైతులు జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పనులు లేక సుదూర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితిని ఉపాధి హామీ పని కొంతవరకు నివారించ గలిగిందన్నారు .ఈ చట్టాన్ని పట్టణాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్లు వస్తున్న క్రమంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.
ఉపాధి హామీ చట్టం స్థానంలో ప్రభుత్వాలు దయ దక్షిణాలపై ఆధారపడి ఉపాధి పనులు చూపాల్లనే ఉద్దేశంతో పథకం రూపంలో మార్చడం బిజెపి ఆర్ఎస్ఎస్ యొక్క భూస్వామ్య మనువాద భావజాలం నిదర్శనం అనే ఆరోపించారు. ఉపాధికి గ్యారెంటీ ఇచ్చే పాత చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వంపై ప్రజాస్వామ్యవాదులు వ్యవసాయ కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో నిర్వహించే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తోట నరసయ్య .పేరుమాండ్ల పుల్లయ్య భూక్య బిక్షపతి బొల్లి కొండ వెంకటయ్య బత్యం సత్యనారాయణ నల్లమాస ఏకాంతం బండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



