ప్రధాన కూడళ్లలో గణపతి మండపాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
‘జైబోలో గణేశ్ మహరాజ్ కి..జై గణపతి బొప్ప మోరియా’నినాదాలతో పల్లెలు,పట్టణాల్లో ఆదిదేవుని నామస్మరణ హోరె త్తుతోంది. గతనెల 27న వినాయక చవితి సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణపయ్య..నవరాత్రోత్సవాల నిర్వహణలో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. గణేశుని విగ్రహాల తయారీ మొదలు.. పూజాకార్యక్రమాల నిర్వహణ వరకూ.. పురోహితులు, మండపాల వద్ద అన్నదానాలు.. వంటలతయారీ వాకెచ విగ్రహాలను మండపాలకు, ఆఖరు రోజున నిమజ్జనోత్స వానికి తీసుకెళ్లే సమయాల్లో బ్యాండ్ మేళాల వారికి,ఇక మండపాల ఏర్పాటుకు టెంట్ హౌస్, మేదరులు, విద్యుత్ దీపాల అలంకరణ పనుల్లో డెకోరేషన్ నిర్వాహకులు బిజీ అయ్యారు. నవరాత్రో త్సవాలు పూర్తయ్యేదాకా ఆదిదేవుని అలంకరణ కోసం వస్త్రాలు, పూలు, పండ్లు, పూజాసామగ్రి తదితర వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. ప్రధానకూడళ్లు.. గల్లీల్లో ఏటా ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో గణనాథులను కొలువుదీర్చే నిర్వాహ కులు మండపాల తయారీకి టెంట్ హౌస్, చలువ పందిళ్లు నిర్మించారు.ఇందుకు సెంట్రీoగ కార్మికులకు ఉపాది దొరికింది.
ఉత్సవం ఇచ్చిన ఉపాధి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES