Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం..

బీఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం..

- Advertisement -
  • – కర్రు కాల్చి వాత పెట్టిన రైతులు
    – సమస్య ఉన్నప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారు..?
  • – యూరియా బస్తాలు సక్రమంగానే అందుతున్నాయి మీరు ఆగం చేయకండి : రైతులు
  • నవతెలంగాణ – రాయపర్తి
  • యూరియా బస్తాల పంపిణీ వద్ద బిఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం చూపెట్టగా రైతులు కర్రు కాల్చి వాత పెట్టినట్లు ప్రశ్నిస్తూ విరుచుకుపడడంతో బిఆర్ఎస్ నాయకులు ముఖాలు వెలవెల పోయాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. అదే తరుణంలో బిఆర్ఎస్ నాయకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్దకు వెళ్లి యూరియా పంపిణీ ఎలా జరుగుతుందని రైతులను అడుగుతుండగా వారు అసహనం వ్యక్తం చేశారు.

    గత మంగళవారం యూరియా బస్తాలు ఇస్తలేరని ఆందోళన చేపట్టి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా చేసినప్పుడు ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకుడు కంటికి కనిపించలేదు.. ఇప్పుడు సక్రమంగా యూరియా బస్తాలు ఇస్తుంటే వచ్చి బిల్డప్పులు ఇస్తున్నారు అంటూ రైతులు విరుచుకుపడ్డారు. వచ్చే యూరియా బస్తాలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారట్టు రైతులు ప్రశ్నించారు. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడికి మీకోసమే వచ్చాము అంటూ కల్లబొల్లి ముచ్చట్లు చెప్ప పోగా వెంటనే స్పందించిన రైతులు మేము కష్టాలలో ఉండి ధర్నా చేసినప్పుడు రాని మీరు మాట్లాడడం సరికాదు అన్నారు.

    చిలికి చిలికి గాలి వాన ఆయన మాదిరిగా రైతులు లీడర్లపై మాటల యుద్ధం చేస్తుండగా ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ బిఆర్ఎస్ లీడర్లను అక్కడినుండి పంపించి రైతులను శాంతింపజేశారు. యూరియా బస్తాల పంపిణీ గూర్చ మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రంను వివరణ కోరగా 888 యూరియా బస్తాలు రాగా టోకెన్ పద్ధతి ద్వారా 444 మంది రైతులకు బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా బస్తాలు ఇస్తాం అన్నారు. బిఆర్ఎస్ లీడర్లపై రైతులు పేడ  నీళ్లు చల్లినట్లు మాట్లాడిన రైతులకు మేలు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం కోసం మెరుపు…
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad