నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేఫథ్యంలో బీహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. అయితే బీహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ పేరుతో బీహార్ వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. తప్పుడు కారణాలతో లక్షల్లో ఓటర్ జాబితా నుంచి ఓట్లు తొలగించారని, బీజేపీతో కలిసి ఈసీ ఓట్లు చోరీ చేస్తుందని ఆయన ఆరోపించారు. మరో వైపు బీహార్ మాదిరి సర్ తమ రాష్ట్రంలో కొనసాగించడానికి వీలులేదని తమిళనాడు, కేరళ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. అందుకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో బీహార్ మాదరి ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాయి.తాజాగా ఇవాళ సాయంత్రం నిర్వహించే మీడియా ఈసీ సర్ పై విధివిధానాలు వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ఎస్ఐఆర్ పై ఉత్కంఠ వీడనుంది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం సోమవారం సాయంత్రం 4:15 గంటలకు జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు పాల్గొని వివరాలను వెల్లడిస్తారని తెలిపారు.
వీటిలో 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను, నకిలీ ఎంట్రీలను తొలగించడం, బదిలీలు వంటి ఓటర్ల జాబితాను నవీకరించడం కోసం SIR ఒక కీలకమైన ప్రక్రియగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ముఖ్యంగా SIR అమలును త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలలో 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.



