Saturday, November 15, 2025
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ మండల సారధి ఎంపిక ఉత్కంఠకు తెర

బీఆర్ఎస్ మండల సారధి ఎంపిక ఉత్కంఠకు తెర

- Advertisement -

–  అశ్వారావుపేట కన్వీనర్ గా వెంకన్న బాబు
– ప్రకటించిన జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

బీఆర్ఎస్ మండల సారధ్యం ఎంపిక ఉత్కంఠకు తెరపడింది.చివరికి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన మండలంలోని తిరుమలకుంట కు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ్ కులానికి చెందిన జుజ్జూరపు వెంకన్న బాబు నే తిరిగి బీఆర్ఎస్ అశ్వారావుపేట మండల కన్వీనర్ గా ఎంపిక చేసినట్లు జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయనే పత్రికా ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

వాస్తవానికి ఈ మండలంలో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా ఇతర అగ్రవర్ణ సామాజిక వర్గం నాయకులు పోటీ పడ్డారు. నియోజక వర్గం ఇంచార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండల బాధ్యులుగా ఎవరిని నియమించాలో పోలుపోని విధంగా వ్యవహరించడంతో జిల్లా అద్యక్షులు లే చివరికి మధ్యేమార్గంగా వెంకన్న బాబు ను నియమించారు. రేగా కాంతారావు విడుదల చేసిన పత్రికా ప్రకటన యదాతధం.

పార్టీ నిర్మాణం లో భాగంగా ఎంతో కాలం నుండి జిల్లాలో ఉన్న మండల,పట్టణ అధ్యక్షులు లేక మండల స్థాయిలో నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసే వారు లేక కొంత ఇబ్బందులు పడ్డాము.ఈ విషయాన్ని గౌ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాలతో ఖాలీ గా ఉన్న అన్ని మండలాలు,పట్టణాలు బాధ్యులను నియ మించాం. చివరిగా అశ్వారావుపేట మండల పార్టీ కన్వీనర్ గా జుజ్జూరి వెంకన్న బాబు ఏకగ్రీవంగా ఎన్నికైనందున వారి పేరు ప్రకటిస్తున్నాను.నేటి నుండి ఆయనే అశ్వారావుపేట మండల పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ ఆయన్ను జిల్లా పార్టీ పక్షాన అభినందిస్తున్నాను.

అధిష్టానం ఆదేశాలతో వారంలో జిల్లాలోని మండల పట్టణ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలియజేస్తున్నాను.జిల్లాలో ఎన్నిక ఏదైనా విజయం చేకూరే వరకు కస్టపడి పనిచేయాలని వంద శాతం గెలుపు గుర్రాలకే స్థానిక ఎన్నికలలో టిక్కెట్స్ ఇస్తామని టిక్కెట్ లు కోసం పైరవీలు చేయవద్దని,పోటీ చేయాలని ఉత్సాహం,ఆసక్తి ఉన్న వారు వారి పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్ ను నియోజక వర్గ ఇంచార్జి లకు ,మండల,పట్టణ అధ్యక్షుల ద్వారా జిల్లా పార్టీకి అందించాలని విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -