Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే రైతు పొలం బాట 

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే రైతు పొలం బాట 

- Advertisement -

విద్యుత్ శాఖ రూరల్ ఏఈ సత్తయ్య 
నవతెలంగాణ – పాలకుర్తి

విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ బోయిని సత్తయ్య అన్నారు. విద్యుత్ శాఖ స్టేషన్ ఘన్పూర్ డి ఈ రాంబాబు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని బమ్మెరలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పొలం బట కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పొలం బాట కార్యక్రమంలో లూజ్ లైన్లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ స్తంభాలా ఏర్పాటు, అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసేందుకు పొలం బట కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందుతుందా లేదా అనే అభిప్రాయాలను తెలుసుకోవడానికి రైతు పొలం బాట ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్ ను ఆదా చేసేందుకు ప్రతి రైతు విద్యుత్ పంపుసెట్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థ అభివృద్ధి కోసం రైతులు సకాలంలో బిల్లులు చెల్లించాలని తెలిపారు. వర్షాలు పడే సమయంలో విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టరాదని, సొంతంగా ప్రయోగాలు చేయరాదని సూచించారు. విద్యుత్ సమస్యలపై అందుబాటులో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్, ఏ ఎల్ ఎం సునీల్, కట్టర్ ఆనంద్ తోపాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -