Sunday, September 7, 2025
E-PAPER
spot_img

కంచె

- Advertisement -

అదొక ప్రకతి పాఠశాల. పాఠశాల పేరు మాత్రమే ప్రకతి కాదు. ప్రకతి నుండే పాఠాలు నేర్పే బడి అది. అక్కడ చదవడం, రాయడం వంటివి ఉండవు. వయసుల వారీగా తరగతులు ఉండవు. ఐదెకరాల తోటలో హాయిగా ఆడుకుంటూ, ప్రకతిని పరిశీలిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ గడపొచ్చు. ఎవరికీ ఆంక్షలు, శిక్షలు ఉండవు. అక్కడ కొత్తగా చేరిన వాసవికి చాలా హాయిగా అనిపించింది. ఇంట్లో అమ్మానాన్నల ఆంక్షలు, బళ్ళో టీచర్ల ఆజ్ఞలు తనను ఎంతో ఇబ్బంది పెట్టేవి. స్నేహితుల ఇంటికి వెళ్తానంటే అమ్మ వద్దనేది. ఒక్కదాన్నే సైకిలు మీద బడికి వెళ్తానంటే నాన్న కోప్పడేవాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే టీచర్లకు సమాధానం చెప్పాలి. ఇవన్నిటితో విసిగిపోయిన వాసవికి ఈ కొత్త పాఠశాల స్వర్గంగా అనిపించింది.
తోటలో కొందరు మొక్కలు నాటుతుండటం చూసి వాసవి కూడా చిన్న పూల మొక్క నాటింది. ఎంతో ప్రేమగా దానికి కొంచెం నీరు పోసి ఆడుకోవడానికి వెళ్ళింది. మేకల మంద అటుగా వెళ్లడం చూసి ఆ మొక్కను తినేస్తుందేమోనన్న భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ వాసవి చూస్తుండగానే ఆ చిన్ని మొక్క వాటి కాళ్ళ కింద నలిగిపోయింది. వాసవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలో ఎదురుగా ఉన్న చెట్టు మీద పక్షి అరుస్తూ ఉండటంతో తలెత్తి అటు చూసింది. తల్లి పక్షి ఆహారం తెచ్చి పిల్లలను పిలుస్తోంది.
గూట్లోని పిల్లలు వచ్చి తల్లి తెచ్చిన ఆహారం తినేసి లోపలకు వెళ్లిపోయాయి. గూడు బయటకు రాబోతున్న పిల్లను మళ్ళీ లోపలకు పంపి తల్లి ఎగిరిపోయింది. పిల్లలంటే తల్లికి ఎంత ప్రేమో అనుకుంది వాసవి. అమ్మ గుర్తొచ్చింది. కిందకు చూసేసరికి నలిగిపోయిన తన చిన్న మొక్క కనిపించింది.
ఇంకొక చిన్న మొక్క తెచ్చి నాటింది. కొంతమంది పిల్లలు వాళ్ళు నాటిన మొక్కల రక్షణకు వాటి చుట్టూ కంచె కడుతుంటే చూసింది. వాసవికి కంచె విలువ అర్ధమయ్యింది. నాన్న గుర్తొచ్చాడు. తను నాటిన మొక్కకు కంచె వేసి కాపాడుకుంది. కొన్ని రోజుల్లోనే అది మొగ్గ తొడిగింది.

డా|| హారిక చెరుకుపల్లి, 9000559913

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad